సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 14 ఏప్రియల్ 2021 (11:40 IST)

రాజ‌కీయ నేప‌థ్యంతో కృష్ణ కుటుంబం నుంచి వ‌స్తున్న హీరో

siva kesnakurthi , Sharan , Sudhakar.M
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి శరన్ ది లైట్ కుమార్ హీరోగా పరిచయమవుతున్నారు. ఎమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా , శివ కేశనకుర్తి దర్శకత్వంలో రూపొందుతోంది. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమం అతిరథ మహారథుల సమక్షంలో జరిగింది.
 
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ఫ్యామిలీ కి చెందిన శరన్ 'ది లైట్ కుమార్' హీరోగా పరిచయమవుతున్నారు..పొలిటికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అందరికి నచ్చేలా తెరకెక్కిస్తానని చెప్పారు. అందరికి ఉగాది శుభాకాంక్షలు అన్నారు.. 
 
నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలా బాగుంది..రెగ్యులర్ సినిమాలా కాకుండా వెరైటీ గా ఉండడంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మే 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించ బోతున్నాం. మా బ్యానర్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది అన్నారు. 
 
హీరో శరన్ మాట్లాడుతూ, ఇంతమంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి నేను హీరోగా పరిచయమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా స్టోరీ ఎంతో బాగుంది. మీ అందరికి నచ్చుతుంది. త్వరలోనే ఓ మంచి సినిమా తో మీముందుకు వస్తాను అని అన్నారు..