ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (12:49 IST)

షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం : నాగార్జున

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందన్నారు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంపై టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. 
 
ఐదేళ్ల క్రితం "మనం" సినిమా కోసం సెట్ వేశామని, ఇక్కడే ప్రమాదం జరిగినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరన్నారు. పక్కన వేరే సెట్స్ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందన్నారు. 
 
సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ''మనం''  సినిమా సెట్ వేసినట్లు తెలిపారు. నాన్న అక్కినేని నాగేశ్వర్ రావుగారి జ్ఞాపకార్థంగా సెట్‌ను అలాగే ఉంచినట్లు నాగార్జున చెప్పారు. నాన్న చివరి రోజులు అక్కడే గడపడం వల్ల తమకు సెట్‌తో ఎంతో అటాచ్‌మెంట్ ఉండేదనీ, కానీ, ఆ సెట్ ప్రమాదంలో కాలిపోవడం తమను ఎంతగానే ఆవేదనకు లోను చేసిందన్నారు.