శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 మే 2021 (12:47 IST)

ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించవచ్చు కదా..? వర్మ

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆయుర్వేద వైద్యుడు బొణిగె ఆనందయ్య గురించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. 
 
''ఎయిర్ ఫోర్స్ వన్‌లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు. 
 
ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా'' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 
కార్పొరేట్ శక్తులతో జాగ్రత్తగా ఉండాలని.. ఆయనను అణగదొక్కే అవకాశం ఉందని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్వీట్ సామాజికమాధ్యమాల్లో రచ్చ చేస్తోంది.