మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (16:48 IST)

పవన్ కల్యాణ్ స్పంద‌న‌తో ఆనందంలో హిమ‌జ‌

Pavan, Himaja
పవన్ కల్యాణ్ సినిమాలో తాను న‌టిస్తున్నాన‌ని బిగ్‌బాస్ ఫేమ్ హిమ‌జ ఇటీవ‌లే సోష‌ల్‌మీడియాలో పెట్టింది. ఎంతో ఆనందంగా వున్నాన‌ని వెల్ల‌డించింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆమెకు లెట‌ర్ ద్వారా రిప్ల‌యి ఇచ్చాడు. అది కూడా చేతితో వైట్ పేప‌ర్‌లో పెన్‌తో రాసిన కాగితం ముక్క‌ను ఆమె అందుకుంది. దాంతో హిమ‌జ ఆనందానికి అవ‌ధులులేవు. ఉబ్బి త‌బ్బిబ‌యింది. పవన్ తనకు రాసిన లేఖను హిమజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

`హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను` అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ `నా ఆనందాన్ని మాటల్లోనూ చెప్పలేకపోతున్నానని వెల్లడించింది.

డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది. పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ విష‌యం తెలిసిన ఆమె స‌న్నిహితులు హిమ‌జ‌కు ఆల్‌ది బెస్ట్ చెప్పారు.