శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (14:49 IST)

పవర్‌స్టార్‌ -ఆలీల భేటీ.. ఎలా వున్నావు అని అడిగారు..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ - హాస్యనటుడు ఆలీ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడిన రాజకీయ పరిణామాలతో వీరిద్దరి మధ్య కొంత దూరం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరపాటు వీరిద్దరూ కలవలేదు. ఈ క్రమంలో తాజాగా ఆలీ కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకకు పవన్‌ హాజరయ్యారు. ఆలీతో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
 
కాగా, ఏడాదిన్నర తర్వాత తన ప్రాణస్నేహితుడ్ని కలవడం గురించి ఆలీ స్పందించారు. పవన్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సుస్వాగతం, తొలిప్రేమ.. ఈ సినిమాలతో మా స్నేహబంధం ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఆయన 27 సినిమాలు చేస్తే.. 25 చిత్రాల్లో నేను నటించాను. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి, అజ్ఞాతవాసిల్లో నటించలేదు.
 
ఈ ఏడాది మా కాంబోలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది.. అంటూ చెప్పుకొచ్చారు. మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. రాజకీయపరంగా కొన్ని అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు.. కానీ మేమిద్దరం ఎప్పుడూ ఒకేలా ఉంటాం. ఆయన్ని కలిసి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. 
 
రాజకీయాలు, కరోనా కారణంగా ఆయన్ని కలవలేకపోయాను. కాకపోతే, మధ్యలో ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్లాను. అప్పుడు ఆయన అక్కడ లేరు. పుణె వెళ్లారని తెలిసి వచ్చేశాను. ఇటీవల మేమిద్దరం కలిసినప్పుడు.. ‘ఎలా ఉన్నావు?’ అని అడిగారు’’ అని ఆలీ వివరించారు.