గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:59 IST)

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

mohanbabu
సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో ఉద్యోగం చేస్తూ రూ.10 లక్షల చోరీకి పాల్పడిన వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ రెండు రోజుల క్రితం జల్పల్లి గ్రామంలోని ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంచిన డబ్బును అపహరించాడు.

ఆ మొత్తాన్ని తీసుకుని గణేష్ రెండు రోజుల క్రితం తిరుపతికి పారిపోయాడు. ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
కాగా 2019లో కూడా మొహన్ బాబు ఇంట్లో చోరీ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే పనిమనిషే డబ్బు నగలు చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కూడా.. ఇంట్లో పనిచేసే వాళ్లే దొంగతనం చేశారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.