ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 2 మార్చి 2023 (17:07 IST)

కలను కథగా రాస్తాను అనుకోలేదు : గ్రంథాలయం దర్శకులు సాయి శివన్

grandhalayam team
grandhalayam team
విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం".  గ్రంధాలయం ప్రమోషన్ లో భాగంగా రెండు తెలుగు రాష్టాలలో ఒక క్యాంపైన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంధాలయం టీం ఇచ్చిన క్లూ ను గెస్ చేసిన  వారిలో కొందరిని సెలెక్ట్  చేసి వారిలోని 10 మందికి సిల్వర్ కీ చైన్, విన్నర్ అయిన వారికి 1 గోల్డ్  కీ చైన్ ఇవ్వడం జరుగుతుంది. ఆలా విన్ అయిన  గణేష్  అనే వ్యక్తి కి లక్ష రూపాయల గోల్డ్ కీ చైన్ ఇస్తామని చిత్ర నిర్మాత అనౌన్స్ చేయడం జరిగింది.
 
విన్నర్ అయిన గణేష్ మాట్లాడుతూ..ఈ క్యాంపెయిన్ పార్టీసీపేట్ చేసి  గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది..మార్చి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ..డైరెక్టర్ ఎంతో తపన పడి  తీసిన ఈ సినిమాలో అందరూ యంగ్ టీం ను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా తీశాడు. నిర్మాత చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ కావాలి. హీరో శేఖరం  అబ్బాయి ద్వారా నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలు బాగున్నాయి. మార్చి 3 న వస్తున్న ఈ సినిమా మాస్ హిట్ అయ్యి దర్శక, నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకులు సాయి శివన్ మాట్లాడుతూ..కల కన్న కథ ఇది అని ఇంతకుముందే చెప్పాను.నేను సినిమా చేద్దాం అని కలలు కన్నాను కానీ నా కొచ్చిన కలను కథగా రాస్తాను అనుకోలేదు.ఆలా రాసేలా ప్రెరేపించిన కథే "ది మహా తంత్ర్  మిస్ట్రీ అఫ్ డెత్".ఇది కొత్త కంటెంట్ చాలా స్టాంగ్ గా ఉంటుంది.హీరో విన్ను నేను "వైరం" సినిమా ద్వారా కలుసుకున్నాము.ఆసినిమాను తెలుగు, కన్నడ బైలింగ్వేల్ లో చేశాము. ఆ సినిమా చేస్తున్నప్పుడు హీరో విన్ను కు ఈ సినిమా లైన్ చెప్పడం జరిగింది.
 
దాంతో రెండు సినిమాలు ప్యార్లల్ గా చేస్తున్న మాకు కరోనా రావడంతో కొంచెం ఇబ్బంది పడ్డాము. కరోనా తర్వాత ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేశాము.నన్ను, విన్ను ను నమ్మి వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ వారు  ఖర్చుకు వెనుకడకుండా ఈ  సినిమా నిర్మించారు.ఇలాంటి  మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు మేము రుణపడి ఉంటాము. మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు చాలా మంచి పాటలు ఇచ్చారు.సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను  కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ఇందులో మాస్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి.మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా  సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.