బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (08:48 IST)

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

Allu Arjun latest
Allu Arjun latest
అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం ప్రచారాన్ని ఆహాలో మొదలు పెట్టారు. మనసులోని మాటలను బయటకు తీయడానికి  హస్ట్ గా వున్న అన్ స్టాపబుల్ కింగ్ నందమూరి బాలక్రిష్ణ చేస్తున్న ప్రయోగం ఇది ఒకటి. తాజాగా అల్లు అర్జున్ గురించి జరిగిన చర్చా గోష్టిలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి చర్చ వస్తే ఏమి చెబుతాడో అని ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు అయితే బాలక్రిష్న, పవన్ కళ్యాణ్ ఫొటోను చూపిస్తూ అభిప్రాయం అడగగానే అల్లు అర్జున్ ఇలా స్పందించారు.
 
కళ్యాణ్ బాబు ఆయన దైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో చాలామంది లీడర్స్ ను, బిజినెస్ పీపుల్స్ ను దగ్గరగా చూశాను. కానీ కళ్యాణ్ బాబును లైవ్ లో మరింత దగ్గరినుంచి చూశాను. ఆయనలో ధైర్యాన్ని ఇష్ట పడతాను అన్నారు. వెంటనే బాలక్రిష్ణ తన దారిలో తాను వెళ్ళిపోతుంటాడు అనగానే.. సేమ్ మీలాగేనే అంటూ చలోక్తి విసిరారు.
 
ఇక ఆ తర్వాత పలువురు హీరోలను చూపిస్తూ వారిపై అభిప్రాయం చెప్పమనగానే.. మహేష్ బాబు అందం అనేది ఆయనకు వరం. కానీ ఆయన ఫెయిల్యూర్ తర్వాత వస్తే సక్సెస్ బలే ఎంజాయ్ చేస్తానుఅన్నారు. 
 
ఇండస్ట్రీలో నీకు పోటీ ప్రభాసా? మహేష్ బాబా? అని బాలక్రిష్ణ అడగగానే... నన్నుమించి ఎదిగినోడు, ఇంకోడున్నాడు సూడు. ఎవరంటే అది రేపటి నేనే.. అంటూ తగ్గేదేలే అన్నట్లుగా జవాబిచ్చారు.
 
ఇప్పటి జనరేషన్ లో నీకు నచ్చి హీరో ఎవరు అన్న ప్రశ్నకు... ఇప్పటి జనరేషన్ లో జన్యూన్ గా అందరూ బాగా చేస్తున్నారు. అందులో నాకు బాగా నచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ పెర్ ఫార్మెన్స్..