శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (17:10 IST)

చిన్న‌ప్ప‌టినుంచీ నాగార్జున అంటే ఇష్టం: కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Kajal Aggarwal
నాగార్జున హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్లు అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తూ, నాగార్జున- ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో రూపొందుతో‌న్న యాక్ష‌న్ డ్రామా‌లోకి కాజ‌ల్‌ను స్వాగ‌తిస్తున్నాం అని స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా  అనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ గోవా, హైద‌రాబాద్‌, ఊటీ, లండ‌న్‌ల‌లో జర‌ప‌డానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌.
 
ఈ సంద‌ర్భంగా కాజల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, ``టాలీవుడ్‌లో నాకు చాలా అద్భుతమైన స‌మ‌యం. నేను తొలిసారిగా నాగార్జునగారితో కలిసి నటించబోతున్నాను. ఇప్ప‌టివ‌ర‌కూ నా కెరీర్‌లో పోషించన‌టువంటి ఒక ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ను ఈ సినిమాలో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న‌తో కలిసి పనిచేయడం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా ఉంది`` అన్నారు. ‌
 
ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ముఖేష్ జి, యాక్ష‌న్: గ‌ణేష్ కె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: బోనీ జైన్‌, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌: జ‌య‌శ్రీ ల‌క్ష్మీ నారాయ‌న‌ణ్‌, ఆర్ట్: ల‌క్ష్మి సిందూజ గ్రాందీ, నిర్మాత‌లు: నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు.