గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (15:09 IST)

కాజల్ అగర్వాల్ అలాంటి దానికోసం అల్లాడుతోందట...

కాజల్ అగర్వాల్. దాదాపు అన్ని షేడ్స్‌లో నటించేసింది. కానీ అరుంధతి లాంటి పాత్ర కోసం అల్లాడుతోందట. అనుష్క శెట్టి నటించిన అరుంధతి చిత్రం ఆమెకి ఎంతపేరు తెచ్చిపెట్టిందో తెలిసిందే. కెరీర్లో నిలిచిపోయిన చిత్రం. అలాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని తనతో ఎవరైనా తీస్తానంటే అందుకు సై అని చెప్తానంటోంది ఈ బ్యూటీ.
 
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. తమిళంలో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రం చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇంకా విభిన్న కథాంశాలతో తన వద్దకు స్క్రిప్టులు వస్తే పరిశీలించే పనిలో వుందట. మరి అరుంధతి లాంటి పాత్రతో ఏ దర్శకుడు ముందుకు వస్తాడో చూడాలి.