ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (17:05 IST)

నాకు పొగరు వచ్చిందేమో కాని శ్రీ విష్ణు అలాగే ఉన్నాడుః నోయల్

14 movie team
నోయల్, విశాఖ ధీమాన్, పోసాని  కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రతన్, జబర్దస్త్ మహేష్ న‌టించిన సినిమా `14`.  లక్ష్మి శ్రీనివాస్ దర్శకత్వంలో  సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మించారు. ఈ. చిత్రం టీజర్ హైదరాబాద్ లో విడుదల చేశారు. హీరో శ్రీ విష్ణు,ముఖ్య అతిధిగా పాల్గొని "14" చిత్రం టీజర్ ను విడుదల చేశారు. 
 
అనంతరం శ్రీ విష్ణు మాట్లాడుతూ, ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్లకు, దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శకుడు చెప్పినట్లు తన మంచి కథ తీసుకొని వస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నోయల్ కు ఈ సినిమా  మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాలలో అవకాశం కోసం ట్రై చేసే వాళ్ళం .ఇప్పుడున్నటువంటి వాట్సాప్,ఫేస్ బుక్ లాంటి ఫాస్ట్ జనరేషన్ అప్పుడు లేదు. మేము ప్రతి రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర అసెంబ్లింగ్ అయ్యేవాళ్ళం. ఫిలింనగర్ కి మేము దూరంగా ఉన్నా.. మేము ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే అందరం కలిసి ఒకే బైక్ మీద ఒకే కారులో  ఆఫీస్ లకు వెళ్ళేవాళ్ళం. నవీన్ , నోయల్, సుభాష్ చాలా మంచి వారు. నోయల్ కు అద్భుతమైన పేరు వచ్చి ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుతున్నానని అన్నారు.
 
హీరో నోయల్ మాట్లాడుతూ, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద వున్నానంటే కారణం రాజమౌళి గారు, సుకుమార్ గార్ల వలనే వీరు అవకాశం ఇచ్చి నాకు బాగా సపోర్ట్ చేశారు. మా మూవీ టీజర్ ను నా క్లోజ్ ఫ్రెండ్స్ తో  రిలీజ్ చూపిస్తే బాగుంటుంద‌ని నేను  పిలిచాను. వీరితోనే నా జర్నీ స్టార్ట్ అయింది.శ్రీ విష్ణు ఉండే స్థాయికి తను రావాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక ఫోన్ చేయగానే వచ్చాడు. ఆ రోజుల్లో మాట్లాడిన విష్ణు కి ఇప్పుడు మాట్లాడే విష్ణు కి తేడా ఏమీ లేదు.తను అలాగే  స్వీట్ గా మాట్లాడుతున్నాడు.తనలో ఎటువంటి మార్పులేదు.నాకు కొంచెం పొగరు వచ్చిందేమో కాని శ్రీ విష్ణు మాత్రం అలాగే ఉన్నాడు. నవీన్అ బాగా సపోర్ట్ చేశాడు. నాకు ఏదైనా బాధగా ఉంటే  నవీన్ కు ఫోన్ చేస్తాడు తను అంతగా నవ్విస్తాడు. ఈ సినిమా స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా వుంటుంది అన్నారు 
 
నిర్మాత సుబ్బారావు రాయన మాట్లాడుతూ, సినిమా ఔట్ ఫుట్ బాగా రావాలని శ్రీనివాస్ మీద నమ్మకంతో అన్ని సమకూర్చాము . సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ విష్ణు మాకు అవకాశం ఇస్తే తనతో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం నోయల్ గారితో మేము సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది . శ్రీనివాస్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు.ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు 
 
మ‌రో నిర్మాత శివకృష్ణ నిచ్చెనమెట్ల మాట్లాడుతూ,  ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది .శ్రీ విష్ణు సినిమాలు కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ తో వస్తున్నాయి. మొదట దర్శకుడు శ్రీనివాస్ సినిమా గురించి చిన్న లైన్ చెప్పాడు. నాకు సినిమా గురించి నాలెడ్జ్ అస్సలు లేదు కానీ లైన్ చెప్పిన వెంటనే మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు.
 
దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ,  శ్రీ విష్ణు గారికి నేను ఇంతకు ముందు కథ చెప్పడం జరిగింది. తను డిఫరెంట్ మూవీస్ చేస్తానని చెప్పారు కూడా. అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి నేను కూడా ఎప్పుడైనా డిఫరెంట్ కథతో తన దగ్గరకు వెళ్లి  సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు.
 
ఆర్టిస్ట్ నవీన్ మాట్లాడుతూ, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది .నోయల్, నేను, శ్రీ విష్ణు అందరూ ఓకే టైం లో  జర్నీ స్టార్ట్ చేశాం. ఈ రోజు పెద్ద స్టార్ల మధ్యలో మా విష్ణు సినిమా ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇదే బాటలో మా నోయల్  సినిమాలు కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. డైరెక్టర్ గారు నాకు ఇంతకు ముందు తెలుసు ట్రైలర్ చాలా బాగుంది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు. 
 
సుభాష్ మాస్టర్, లోహిత్, కేశవ్,  మాట్లాడుతూ, విజ‌య‌వంతం కావాల‌ని మనస్పూర్తిగా కోరుతున్నామ‌ని అన్నారు.