1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (15:41 IST)

దర్జాలో భయపెట్టడానికి ప్రయత్నించాను - అన‌సూయ‌

Darja pre-release
Darja pre-release
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం రాత్రి హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేసి చిత్ర సమర్పకుడు కామినేని శ్రీనివాస్‌కు అందించారు.
 
అనసూయ మాట్లాడుతూ,  ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న అల్లు అరవింద్‌, వెంకటేష్‌, సురేష్‌బాబు, రాఘవేంద్రరావు, నవీన్ ఎర్నేని, బుచ్చిమాయ్య థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు. అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. నేను షకీల్‌గారిని సంగీత దర్శకుడు అని అనుకోలేదు. నిర్మాత అనుకున్నాను. ఎందుకంటే ప్రతీది తను దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవిగారు ఒక బ్యాంకర్‌లా కనిపించేవారు. ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను.  ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. జోక్స్ పార్ట్ పక్కన పెడితే.. ఇది అద్భుతమైన సినిమా. థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకండి. థియేటర్‌లో జూలై 22న వస్తున్న ఈ సినిమా చూడండి. అని అన్నారు. 
 
నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ, క్లైమాక్స్ ఆర్ఆర్ విని  నేను థ్రిల్ ఫీలయ్యాను .నేను కూడా ఈ మూవీ లో ఓ పాట పాడాను. ఆ పాటలోనా కుమార్తె  కూడా  భాగమైంది అని తెలిపారు.
 
నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ,  ర్యాప్ రాక్ షకీల్ మంచి సంగీతం ఇవ్వగా.. ఆయన భార్య నేహా ఇందులో ఓ పాటని చాలా చక్కగా పాడారు. సునీల్, అనసూయ, సత్తిపండు ఇలా ఎందరో ఈ సినిమాలో నటించారు. జూలై 22న సినిమా విడుదలకాబోతోంది. అంతా దర్జాగా థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసి ఘన విజయం చేయాలని కోరుతున్నాను అన్నారు.
 
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా చాలా బాగా వచ్చినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ డ్యాన్స్ బాగా చేశారు. అనసూయగారు ఈ పాత్రలో చాలా హుందాగా ఉన్నారు.  కంటెంట్ వైజ్‌గా చాలా మంచి కంటెంట్ ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నా చిత్రం ‘గంధర్వ’కు ర్యాప్ రాక్ షకీల్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా ఆయన అదరగొట్టేసి ఉంటాడని అనుకుంటున్నాను. థ్యాంక్యూ ఆల్’’ అని తెలిపారు. 
 
సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్ మాట్లాడుతూ,  ఉత్తేజ్‌గారు పాడిన పాటకి ఓ విశిష్టత ఉంది. ఆ పాట అనసూయగారి వాక్ చూసి పుట్టింది. అలాగే అనసూయగారి లుక్‌లో నుండే ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పుట్టింది. అందుకే ఇవాళ ఆర్ఆర్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసి థియేటర్ ‌నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ అనసూయగారి గురించి, సునీల్ గురించి తర్వాత డైరెక్టర్ గారి గురించి, ఆ తర్వాత బీజీఎమ్ గురించే మాట్లాడతారు అని అన్నారు.
 
దర్శకుడు సలీమ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘దర్జా అంటే రాయల్టీ. స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీ. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇటువంటి కథ తెరపైకి వచ్చిందని చెప్పగలను. జూలై 22న థియేటర్లకి వెళ్లి ‘దర్జా’గా ఈ సినిమా చూడండి.  డిఫరెంట్‌గా ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి అని అన్నారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలో నాగమహేష్, షఫీ, కుమనన్ సేతురామన్, వెంపక శ్రీను,  కరీంనగర్ సిటీ కమిషనర్ సత్యన్నారాయణ, ఐడీబిఐ బ్యాంక్ డిజిఎమ్స్ వి. ప్రదీప్ కుమార్, ఎస్‌సిఎమ్ శెట్టి, హము రమావత్, ఇంకా చిత్రబృందం పాల్గొంది