మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:17 IST)

బాలయ్య దర్శకత్వ ప్రతిభ చూడాలనుకుంటే నర్తనశాల చూడాల్సిందే...

నందమూరి బాలకృష్ణ నటిస్తూ.. దర్శకత్వం వహించాలి అనుకున్న చిత్రం నర్తనశాల. ఈ చిత్రంలో సౌందర్య ద్రౌపతి క్యారెక్టర్ పోషించారు. వైజాగ్‌లో షూటింగ్ చేసారు. ఈ మూవీ కోసం భారీ సెట్ వేసారు. ఇది బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్న టైమ్‌లో ఊహించని విధంగా ఆపేయాల్సి వచ్చింది.
 
సౌంద‌ర్య ఆకాల మ‌ర‌ణం కూడా ఈ సినిమా ఆగిపోవ‌డానికి ఓ కార‌ణ‌ం అని చెప్పచ్చు. అయితే... కొంత పార్ట్ షూటింగ్ చేసారు. దానిని అలాగే ఉంచేసారు కానీ.. ఎప్పుడు రిలీజ్ చేయాలి అనుకోలేదు.
 
 ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అయితే... సినిమా మొత్తం కాదు. అందులోని 17 నిమిషాలు. షూటింగ్ జ‌రుపుకున్న కొంత భాగాన్ని ఎడిట్ చేసి, రీ-రికార్డింగ్ జ‌రిపి, డ‌బ్బింగులు చెప్పి ఈ 17 నిమిషాల ఎపిసోడ్‌ని రిలీజ్ చేస్తుండటం విశేషం.
 
శ్రేయాస్ ఓటీటీ ద్వారా విడుద‌ల చేస్తున్నారు. అసలు బాల‌య్య పుట్టిన రోజున జూన్ 10న ఈ ఎపిసోడ్‌ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ.. వర్క్ కంప్లీట్ కాలేదు. ఇప్ప‌టికి ఆ ప‌నులు పూర్త‌య్యాయి. అందుచేత ఈ నెల 24న శ్రేయాస్‌లో న‌ర్త‌న శాల‌ చూడొచ్చు.
 
 అయితే.. ఈ ఎపిసోడ్‌ని ఓటీటీలో చూడడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాలకృష్ణ సామాజిక సేవ కోసం ఉపయోగించనున్నారని తెలిసింది. మరి.. బాలయ్య నర్తనశాల ఎలా ఉంది..? బాలయ్య దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంది..? అనేది తెలుసుకోవాలంటే.. నర్తనశాల చూడాల్సిందే.