శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (15:11 IST)

ఫిజీ టూరిస్ట్ అంబాసిడర్‌గా ఇలియానా.. ఎందుకంటే?

ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్‌గా గతంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు పరిణతి చోప్రా, న్యూజిలాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా వ్యవహరించారు. తాజాగా వారి జాబితాలో ఇలియానా కూడా చేరింది. ఎలాగంటే? ఫిజీ

ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్‌గా గతంలో బాలీవుడ్ సెలెబ్రిటీలు పరిణతి చోప్రా, న్యూజిలాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా వ్యవహరించారు. తాజాగా వారి జాబితాలో ఇలియానా కూడా చేరింది. ఎలాగంటే? ఫిజీ దేశంతో భారత్‌కు బలమైన సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఫిజిలో నివసిస్తున్న 38 శాతం మంది ప్రజలు భారత సంతతికి చెందిన వారే. 
 
ఈ నేపథ్యంలో ఫిజీ దేశపు పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా అందాల ముద్దుగుమ్మ ఇలియానా ఎంపికైంది. కొన్నేళ్ల పాటు ఫిజిలో పర్యటించే భారతీయుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో భారతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఇలియానాను ఫిజీ దేశం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 
 
దీనిపై ఇలియానా మాట్లాడుతూ.. అందాల దేశం ఫిజీతో కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. వారి ఆతిథ్యం, ప్రేమ, తనకు సొంతింటిలో ఉన్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. అలాగే ఫిజీ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. భారతీయ పండగలైన దీపావళి, వినాయక చవితిని తాము ఘనంగా జరుపుకుంటామని చెప్పారు. ఇలియానా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం ద్వారా దేశంలో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.