శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (15:58 IST)

నా బెల్లీని స్లో మోషన్‌లో చూపించారు.. అందాల వస్తువుగా?: ఇలియానా

11 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో వున్న అందాల భామ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగు ఇండస్ట్రీకి ''దేవదాసు'' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. తన బాయ్‌ఫ్రెండ

11 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో వున్న అందాల భామ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగు ఇండస్ట్రీకి ''దేవదాసు'' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై ఇలియానా తన అంగాంగ ప్రదర్శనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
 
తన తొలి సినిమా షాట్‌లో తన బెల్లీని స్లో మోషన్‌లో చూపించారని తెలిపింది. దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు సినిమాల్లో తనను అందాల వస్తువుగానే చూపించారని తెగ ఆవేదన చెందింది. తన సినిమాల్లో మహిళలను వస్తువులుగానే పరిగణించడం చాలా చిరాకు తెప్పించిందని వాపోయింది. తన తొలి చిత్రంలో దేవదాసులో తన అంగాంగ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పింది. 
 
పోకిరి, కేడీ, ఖతర్నాక్ మున్నా సినిమాల తర్వాత ''ఆట'' చేసేటప్పుడు కూడా మహిళలను అందాల వస్తువుగానే చూపించడం చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపించిందని తెలిపింది. అప్పట్లో ఇక సినిమాలు ఆపేద్దామని అనిపించిందని ఇలియానా వెల్లడించింది. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో చేసిన జల్సా, రవితేజతో నటించిన ''కిక్'' చిత్రాల్లో తన పాత్రలు భిన్నంగా వుంటాయని ఇలియానా తెలిపింది.
 
దక్షిణాదిన అగ్ర హీరోలు, అగ్ర దర్శకులతో పనిచేసినా.. అందాల ప్రదర్శనతో పాటు డబ్బే ప్రధానంగా కనిపించిందని.. అయితే ఏడు సినిమాల తర్వాత ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి.. ప్రాధాన్యత గల చిత్రాలను ఎంచుకున్నానని.. ఈ మార్గం ద్వారానే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చానని ఇలియానా వెల్లడించింది. అందుకే బాలీవుడ్‌లోనూ తన సినిమాల్లో వైవిధ్యం కనిపిస్తుందని చెప్పింది. 
 
ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో రైడ్ సినిమాలో నటించినట్లు ఇలియానా వెల్లడించింది. అందుకే రెండేళ్లకు ఓ సినిమా చేయాల్సి వస్తుందని ఇలియానా తెలిపింది. ఇప్పటికే 2012లో బర్భీ, మేన్ తేరా హీరో (2014), రుస్తుమ్ (2016) సినిమాల్లో ఇలియానా నటించిన సంగతి తెలిసిందే.