సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:20 IST)

ఆ డైరెక్టర్ సినిమాలో నటించేందుకు యువ హీరో తాపత్రయం

ఒక్క సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో తానేంటో నిరూపించుకున్నాడు "ఛలో" డైరెక్టర్ వెంకీ. తనే కథ రాసుకుని, ఫెయిల్యూర్ సినిమాల్లో నటిస్తున్న నాగశౌర్యను అవకాశం ఇచ్చి సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళాడు.

ఒక్క సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో తానేంటో నిరూపించుకున్నాడు "ఛలో" డైరెక్టర్ వెంకీ. తనే కథ రాసుకుని, ఫెయిల్యూర్ సినిమాల్లో నటిస్తున్న నాగశౌర్యను అవకాశం ఇచ్చి సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళాడు. అసలు 'ఛలో' సినిమా హిట్టవుతుందని ఎవరూ అస్సలు ఊహించలేదు. మొదటిమూడు రోజుల్లోనే 'ఛలో' విజయంవైపు దూసుకెళుతూ భారీ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు 'ఛలో' డైరెక్టర్ వెంకీ డైరెక్షన్‌లో నటించేందుకు యువ నటులు పోటీలు పడుతున్నారు. కొంతమంది యువనటులైతే వెంకీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 
అందులో నితిన్ ఒకరు. విలక్షణమైన నటనతో దూసుకెళుతున్న నితిన్ మరో విజయం కోసం ఎదురుచూస్తున్నారు. తన కోసం ఒక కథను సిద్ధం చేయాలని వెంకీని కోరారట నితిన్. హీరో నితిన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు ఒక సినిమాను కూడా వెంకీ సిద్ధం చేయడంతో ఆ సినిమాను తీసేందుకు హారిక అండ్ హాసిని బ్యానర్ ముందుకు వచ్చింది. దీంతో సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుందన్న నమ్మకంలో ఉన్నారు నితిన్.