గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:28 IST)

ఇల్లీ బేబీ గర్భవతినా? మరి సన్నజాజి తీగలా తయారైందేంటి?

గోవా బ్యూటీ ఇలియానా గర్భవతంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఏ ఒక్కరూ స్పందించలేదు. అయితే, తాజాగా ఇల్లీబేబీ సన్నజాజి తీగాలా మారిపోయింది. దీనికిపైగా, కుర్రకారు హీరోయిన్లకు పోటీ ఇస్తానంటూ స్టేట్మెంట్లు ఇస్తోంది. 
 
గతంలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఇలియానా కనిపించింది. ఇందులో కాస్త బొద్దుగా కనిపించింది. ఈ చిత్రంపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో ఈ అమ్మడుకు అవకాశాలు రాలేదు. కానీ, తన ఫేవరేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. కానీ, ఇవి కేవలం రూమర్సేనని తేలింది. 
 
ఈ క్రమంలో ఇలియానా ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో ఇలియానాని చూసిన అభిమానులు నోరెళ్ల‌పెడుతున్నారు. 
 
కాగా, విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల‌ ఇల్లీ బేబీ గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వీటిపై ఇలియానా పెదవి విప్పని విషయం తెల్సిందే.