గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:55 IST)

నాన్న ఒక్కసారి లేవమ్మా.. బోటు ప్రమాదంలో మృతి చెందిన హాసిని..

నాన్న ఒక్కసారి లేవమ్మా.. నీకు ఇష్టమైన చీర తీసుకొచ్చాను.. ఒక్కసారి చూడమ్మా అంటూ బోటు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని తల్లి మధులత బోరున విలపిస్తున్న తీరు తిరుపతి స్థానికులను కలచి వేస్తోంది. మూడురోజుల క్రితం పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో సుబ్రమణ్యం కుటుంబం కనిపించకుండా పోయారు. సుబ్రమణ్యం భార్య మధులత మాత్రం సురక్షితంగా బయటపడింది. కానీ, భర్త సుబ్రమణ్యం, అతని కుమార్తె హాసిని మాత్రం కనిపించకుండా పోయారు. 
 
రెండురోజుల పాటు ఎన్టీఆర్‌ఎఫ్ బలగాలు రెస్క్యూ నిర్వహించి మృతదేహాలను బయటకు తీశారు. భర్త, కుమార్తె మృతదేహాలను చూసిన మధులత చలించిపోయింది. తీవ్ర ఆవేదనకు గురైంది. మంగళవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి హాసిని మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కారంపల్లిలోని రాదేశ్ శ్యామ్ అపార్టుమెంట్‌లో పార్థీవదేహాన్నిసందర్శనార్ధం ఉంచారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని చిత్తూరు సమీపంలోని పూతలపట్టు వద్దనున్న వేపనపల్లెకు తీసుకెళ్ళారు. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, ఈ నెల 16వ తేదీన హాసిని పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సి వుండగా, బోటు ప్రమాదంలో జలసమాధి అయింది.