గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (10:36 IST)

నెట్టింట వైరల్ అవుతున్న ఇలియానా కుమారుడి ఫోటో

Michael Dolan
Michael Dolan
జల్సా ఫేమ్ ఇలియానా బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ప్రస్తుతం పెళ్లి జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తాజాగా ఇలియానా డి'క్రూజ్ తన పసిబిడ్డ కోవా ఫీనిక్స్‌ను భర్త మైఖేల్ డోలన్‌తో కలిసి తీసిన ఫోటోను నెట్టింట షేర్ చేసింది. 
 
ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలియానా తన కుమారుడు, డోలన్‌పై విశ్రాంతి తీసుకుంటున్న మోనోక్రోమ్ చిత్రాన్ని అప్‌లోడ్ చేసింది. లిటిల్ కోవా తన తండ్రి ఒడిలో వున్నాడని తెలిపింది.
 
గతేడాది ఆగస్టు 1న ఇలియానా డోలన్‌తో కోవాకు స్వాగతం పలికింది. త్వరలో 'దో ఔర్ దో ప్యార్'లో ఇలియానా కనిపించనుంది. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.