మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (21:37 IST)

నటి కిడ్నాప్ కేసు.. కేరళ ప్రభుత్వానికి సుప్రీం చివాట్లు.. అసలు ఏమనుకుంటున్నారు?

Dileep
ప్రముఖ నటి కిడ్నాప్.. లైంగిక దాడి ఘటనలో బాధితురాలైన మహిళ కారులో కొచ్చి వెళ్తుండగా ఆమెను బంధించి మలయాళ నటుడు దిలీప్‌తో పాటు కొంతమంది వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి తెగబడినట్లు కేరళ పోలీసులు తెలిపారు. అంతేగాక ఈ ఘటన సమయంలో నిందితులు ఘటనకు సంబంధించి తమ ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు కూడా తీశారని, ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా నటుడు దీలిప్‌గా బాధితురాలు ఆరోపించడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేరళ సర్కారు వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
దిలీప్‌తో మరో కొంతమంది లైంగిక వేధింపులు, అపహరణ కేసు విచారణను బదిలీ చేయాలని కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను మంగళవారం తోసిపుచ్చింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది జి ప్రకాష్ ‘బాధితురాలిపై ప్రాసిక్యూషన్‌, వేధింపుల పట్ల పక్షపాత సంఘటనల కారణంగా ఈ కేసు విచారణ దెబ్బతిందని, న్యాయమైన విచారణ పొందడం బాధితురాలి హక్కు’ అని ఆయన ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీనిపై విచారించిన సుప్రీం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. నటి కిడ్నాప్, దాడి కేసు విచారణ జరుగుతున్న కోర్టు న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాదించిన కేరళ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. 
 
ఈ ఆరోపణల్లో వాస్తవాలు లేవు. న్యాయమూర్తిని మార్చాలని చెప్పినంత మాత్రాన అలా చెయ్యడం సాధ్యం కాదు, మీ డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకుని జడ్జిని మార్చడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు..?, మీ వాదలను మీరే సమర్థించుకుంటారా అంటూ సుప్రీం కోర్టు మండిపడుతూ కేరళ ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రముఖ నటి దాడి కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిని మార్చాలని వెళ్లిన కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చివాట్లు తప్పలేదు.