బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (11:13 IST)

24 గంటల్లో 30వేల కొత్త కేసులు..

దేశంలో కరోనా కేసులు 98లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 30,006 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775 కేసులు నమోదయ్యాయి. తాజాగా 442 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కోవిడ్‌ మరణాలు 1,42,628కి చేరువయ్యాయి. 
 
ప్రసుత్తం దేశంలో 3.59 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. గత 24 గంటల్లో 33,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 93.24 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కేరళ, మహారష్ట్రలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.