శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (11:33 IST)

ఇండియన్ ఐడల్ 13వ సీజన్ విజేతగా రిషి సింగ్ - ప్రైజ్ బహుమతి ఎంతంటే...

rishi singh
ప్రముఖ టీవీ చానెల్ సోనీ టీవీ నిర్వహించే సింగింగ్ రియాలిటీ షోర్ ఇండియన్ ఐడల్ 13వ సీజన్ విజతగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ నిలిచారు. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిషి సింగ్ విజేతగా నిలవడంతో ఆయనకు నగదు బహుమతి కింద రూ.25 లక్షలు అందజేశారు. అలాగే, రన్నరప్‌గా కోల్‌కతాకు చెందిన దేబాస్మితా రాయ్, జమ్మూకాశ్మీర్‌కు చెందిన చిరాగ్ కొత్వాల్ రెండో రన్నరప్‌గా నిలించారు. వీరికి తలా రూ.5 లక్షలు చొప్పున నగదు బహుమతి ప్రదానం చేశారు. 
 
ఈ రియాలిటీ సింగింగ్ షో గ్రాండ్ ఫైనల్‌కు సోనాక్షి కర్, శివమ్ సింగ్, బిదీప్తి చక్రవర్తి చేరారు. హిమేష్, విశాల్ దద్లానీ, నేహా కక్కర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. టాప్-6 పోటీదారులతో గట్టి పోటీని తట్టుకుని రిషి సింగ్ తన గాత్రంతో మెప్పించారు. ఇక అనాథ అయిన రిషి తన జీవితం గురించి వివరించారు. తన తల్లిదండ్రులు తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించివుండేవాడినని రిషి భావోద్వేగంతో చెప్పాడు.