మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మార్చి 2023 (20:18 IST)

మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు అయోధ్యలో అర్జునుడు టైటిల్?

Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబో తెరపై కనిపించనుంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ప్రకటించలేదు. 
 
ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటల్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశం వుంది. ఈ చిత్రానికి అర్జునుడు, అయోధ్యలో  అర్జునుడు అనే టైటిల్స్ పరిశీలనలో వున్నాయి.