గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (16:57 IST)

శ్రీదేవి మృతి.. ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి.. యోధుడన్న భార్య

అతిలోక సుందరి శ్రీదేవి మృతి నుంచి ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్, సినీలోకం బయటపడుతోంది. ఈ నేఫథ్యంలో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వచ్చిన వార్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇర్ఫాన్ ఖాన్

అతిలోక సుందరి శ్రీదేవి మృతి నుంచి ఇప్పుడిప్పుడే ఫ్యాన్స్, సినీలోకం బయటపడుతోంది. ఈ నేఫథ్యంలో విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వచ్చిన వార్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇర్ఫాన్ ఖాన్ జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాడని.. ఆయనకు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, సహచర నటులు అండగా నిలుస్తారు. 
 
ఇంకా తన భర్త ఓ యోధుడని ఇర్ఫాన్ భార్య కొనియాడారు. ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యంపై భార్య సుతాప సిక్దర్ ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేశారు. ఇర్ఫాన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ ఆరోగ్యం పర్లేదని.. ఇర్ఫాన్ వ్యాధి గురించి ఎలాంటి ఊహాగానాలను మీడియా ప్రసారం చేయొద్దని కోరారు.
 
తనను ఆవహించిన మహమ్మారి వ్యాధిపై ఇర్ఫాన్ మనోధైర్యంతో పోరాడుతున్నట్లు సుతాప చెప్పారు. ఇర్ఫాన్ ఆరోగ్యంపై, ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారనే విషయం పరీక్షల్లో నిర్ధారణ అయ్యాక.. త్వరలోనే ఆ వివరాలను మీడియాకు వివరిస్తానని సుతాప చెప్పుకొచ్చారు.