రాహుల్ బయటకు వచ్చేస్తాడేమోనని పునర్నవి భయపడుతోందా?

Punarnavi
జె| Last Modified బుధవారం, 9 అక్టోబరు 2019 (15:20 IST)
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది పునర్నవి. అయితే బిగ్ బాస్ 3 హౌస్‌లో పునర్నవి, రాహుల్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ప్రధానంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరిగిందంటూ ప్రచారం కావడంతో జనం ఆసక్తిగా తిలకించారు. మిల్కీ బ్యూటీ లాంటి పునర్నవి.. యావరేజ్ గై రాహుల్‌ను ప్రేమించడం ఏంటనే చర్చ కూడా జరిగింది.

అయితే అనుకున్న విధంగా పునర్నవి హౌస్ నుంచి బయటకు రావడం.. తనను ప్రేమించాడనే టాక్‌తో జనాల్లో నానుతున్న రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండటంతో పునర్నవి ఆలోచనలో పడింది. రాహుల్‌తో పాటు వరుణ్‌కు ఓటెయ్యండని బిగ్ బాస్‌ను చూసే ప్రేక్షకులను కోరుతోంది పునర్నవి. రాహుల్, వరుణ్‌కు ఓటెయ్యండని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ షేర్ చేస్తోందట పునర్నవి.

ఐతే కొందరు మాత్రం రాహుల్ బయటకు వస్తున్నాడని పునర్నవి భయపడుతోందనీ, అందుకే ఎలాగైనా రాహుల్ ను బిగ్ బాస్ ఇంట్లోనే మరికొన్నిరోజులు వుండేలా చేయాలని చూస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :