శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (22:24 IST)

రానా - నాని మల్టీస్టారర్ నిజమేనా?

ఎన్టీఆర్ - ఎ.ఎన్.ఆర్ కాలంలో మల్టీస్టారర్ మూవీస్ వచ్చేవి. ఆ తర్వాత కృష్ణ - శోభన్ బాబు, కృష్ణంరాజుల టైమ్‌లో కూడా మల్టీస్టారర్ మూవీస్ వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... కాలంలో మల్టీస్టారర్ మూవీస్ అంతగా రాలేదు. అయితే... మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఎప్పుడూ రెడీ అని నాగార్జున, వెంకటేష్ చెప్పేవారు. ఇటీవల కాలంలో... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చినప్పటి నుంచి మల్టీస్టారర్ మూవీస్‌కి టైమ్ వచ్చినట్లైంది.
 
ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలు మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వచ్చారు. గోపాల గోపాల, మనం, వెంకీమామ, పాండవులు పాండవులు తుమ్మెద, బాహుబలి, దేవదాస్.. ఇలా మల్టీస్టారర్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు రానా - నాని కలిసి మల్టీస్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.
 
ఈ భారీ క్రేజీ మూవీని సురేష్‌ బాబు నిర్మించనున్నారు. ఓ ప్రముఖ రచయిత ఈ చిత్రానికి పవర్‌ఫుల్ స్టోరీని అందిస్తున్నారని తెలిసింది. ఈ మూవీకి దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. మరి... ఈ క్రేజీ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.