శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (13:13 IST)

ఫర్హాన్ అక్తర్‌తో డేటింగ్‌లో ఉన్న ప్రభాస్ హీరోయిన్...

రాజకీయ నాయకులు పార్టీ మార్చినంత తేలికగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా బాయ్‌ఫ్రెండ్‌ని మార్చేసిందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ఈమె ఫర్హాన్ అక్తర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆఖరికి ఆమె అభిమాను

రాజకీయ నాయకులు పార్టీ మార్చినంత తేలికగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా బాయ్‌ఫ్రెండ్‌ని మార్చేసిందంటున్నారు బాలీవుడ్‌ జనాలు. ఈమె ఫర్హాన్ అక్తర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆఖరికి ఆమె అభిమానులు కూడా ఇదే డిసైడ్‌ అయ్యారట.
 
ఇప్పుడు ఓ ఫోటోగ్రాఫర్‌తో తెగ షికార్లు చేస్తోందట. అతగాడేమో శ్రద్ధాతో తనకు మంచి స్నేహం తప్ప ప్రేమాదోమాలాంటి ఫీలింగ్స్‌ లేవనీ, ఆల్రెడీ తను వేరొక అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నానని అంటున్నాడట. 
 
సరే.. ఆ ఫోటోగ్రాఫర్‌ చెప్పినట్టు వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అయితే షికార్లకు, పబ్‌లకు వెళ్ళడం ఎందుకు? అన్న అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విషయంలో శ్రద్ధాకైనా క్లారిటీ ఉందా? అని కూడా అంటున్నారు. 
 
సముద్రంలోతూ, ఆడపిల్లల మనసు అంత త్వరగా అర్థం కాదని అంటుంటారు అందుకేనేమో. ప్రస్తుతం శ్రద్ధాకపూర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.