శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (14:04 IST)

సినిమాలకు గుడ్ బై చెప్పేసిన అమీర్ ఖాన్ కూతురు..!

''దంగల్'' నటి జైరా వాసిమ్ సినిమాలకు బైబై చెప్పేసింది. దంగల్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న వాసిమ్.. సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఇందుకు కారణం ఏమిటనే విషయం కూడా చెప్పేసింది. తన జీవితాన్నే మార్చేసిన బాలీవుడ్ సినిమా పరిశ్రమ.. నమ్మకాన్ని కూడా కోల్పోయేలా కూడా చేసిందని చెప్పింది. 
 
ప్రస్తుతం తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తాను ఎంచుకోవాల్సిన వృత్తి ఇది కాదన్నారు. ప్రస్తుతం తనకున్న గుర్తింపుతో తనకు సంతోషంగా లేనని.. ముస్లింని కావడంతో బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి భయాల మధ్య తాను సినిమాల్లో కొనసాగలేను. ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ భయాల నుంచి బయటపడలేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
అల్లాతో తనకున్న అనుబంధాన్ని చెడ‌గొట్టేలా చేస్తున్న ఇలాంటి వాతావార‌ణంలో తాను జీవించలేనని జైరా వాసిమ్ తేల్చేసింది. గొప్ప న‌టిగా ఎద‌గాల‌ని క‌న్న క‌ల‌ల‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తున్నాన‌ని ఫేస్‌బుక్ ద్వారా వెల్ల‌డించింది. త‌న వృత్తిని, మ‌తంతో పోల్చ‌డం త‌నను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంద‌ని, అందుకే సినిమాల నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్నాన‌ని ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొంది.