శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 12 నవంబరు 2019 (21:14 IST)

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ `త‌లైవి` షూటింగ్ ప్రారంభం

తమిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను `త‌లైవి` పేరుతో రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ బాష‌ల్లో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నేటి నుండి చెన్నైలో ప్రారంభ‌మైంది. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
 
ఎంజీఆర్ లేకుండా జ‌య‌లలిత బ‌యోపిక్‌ను ఊహించ‌లేం. అలాంటి లెజెండ్రీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు. 
 
ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. బ్లేడ్ ర‌న్న‌ర్‌, కెప్టెన్ మార్వెల్ వంటి హాలీవుడ్ చిత్రాల్లో వ‌ర్క్ చేసిన ప్ర‌ముఖ హాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్ట్ కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా చూపిస్తున్నారు.