సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (20:17 IST)

సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ నుంచి జీవితను తొలగించాలి....

jeevitha
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొత్త చిత్రం "వ్యూహం". ఈ చిత్రం సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రివైజింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న సినీ నటి జీవిత రాజశేఖర్‌ను తప్పించాలని నిర్మాత నట్టి కుమార్ కోరారు. జీవిత గతంలో వైకాపాలో ఉన్నారని, ఇపుడామె భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ వైకాపాతో సంబంధాలు ఉంటాయని, అందుకే ఆమెను కమిటీ నుంచి తాత్కాలికంగా తప్పించాలని కోరారు. 
 
దీనిపై నటి జీవిత స్పందించారు. తాను ఇపుడు బీజేపీలో ఉన్నానని వెల్లడించారు. తనకు వైకాపాతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. మీయాలో వ్యాప్తి చెందుతున్న ఫోటోలు చాలా సంవత్సరాల నాటివని జీవిత రాజశేఖర్ వెల్లడించారు. 
 
ఆ నగదును అభ్యర్థుల ఖాతాల్లో జమ చేయండి : ఈసీ ఆదేశం 
 
అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడే నగదును ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే జమ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలీసులు, అధికారుల తనిఖీల్లో భారీగా నగదు, నగలు, కానుకల పట్టుబడుతున్నాయి. వీటి విలువను ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ ఆదేశాలను జారీ చేసింది. 
 
నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఖాతాకు జమ చేయాలని సూచించింది. తద్వారా అక్రమ మద్యం, డ్రగ్స్ కట్టడికి ఆధునికంగా ఆలోచించాలని ఈసీ చెబుతోంది. మునుగోడు ఉప ఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలు సహా ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది.
 
మరోవైపు, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ బృందం హైదరాబాద్ నగరంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించింది. తనిఖీలు, స్వాధీనాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట నిఘా ఉంచాలని, తనిఖీలు ముమ్మరంగా జరగాలని, చెక్ పోస్టుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని సూచించారు. 
 
అచ్చం అమ్మలాగే.... అతిలోక సుందరిని మురిపిస్తున్న తనయ! 
 
భారతీయ చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన అందాల నటి దివంగత శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్.. ఇపుడు అచ్చం అమ్మను తీసిపెట్టింది. ఆమెకు సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో జాన్వీ కపూర్ అచ్చం తన తల్లి శ్రీదేవిలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోను "దేవర" యూనిట్ షేర్ చేసింది. 
 
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇక్కడ జాన్వీ కపూర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా "ఇదిగో మా తంగం" అంటూ జాన్వీ కపూర్ ఫోటోను 'దేవర' యూనిట్ షేర్ చేసింది. లేలేత పరువాల జాన్వీ చిరు నవ్వులు చిందిస్తూ చూడగానే ఇట్టే ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. అందుకే ఇదిగో మా తంగం అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. మరోవైపు, ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. 'దేవర' చిత్రానికి కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవించంద్రన్ సంగీతం అందిస్తున్నారు.