మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (15:47 IST)

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న జై లవకుశకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం రిలీజైన ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు.. జూనియర్ ఎన్టీ

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని.. ఆయన నటిస్తున్న జై లవకుశకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం రిలీజైన ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు.. జూనియర్ ఎన్టీర్. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జై లవకుశ ఫస్ట్ లుక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ హిట్‌ తరహాలోనే జై లవకుశ సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. 
 
అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న జై లవకుశ సినిమాకు అంతర్జాతీయ ప్రమాణాలను జోడిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్ పనిచేస్తున్నారు. ఈయన గతంలో లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్, షటర్ ఐలాండ్ చిత్రాలకు పనిచేశారు. ఈ చిత్రంలో విలన్ ఛాయలున్న పాత్రను వాన్స్ ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే లీకై వైరల్ అయ్యాయి.