శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:10 IST)

'అరవింద్ సమేత వీర రాఘవ'లో 'పెనివిటి' సాంగ్ రిలీజ్ ఎపుడంటే...

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబరు 13వ తేదీన విడుద

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. దసరా కానుకగా అక్టోబరు 13వ తేదీన విడుదలకానుంది. సెప్టెంబ‌ర్ 20న చిత్ర ఆడియోని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. ఇక కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి ఒక్కో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు.
 
ఇటీవ‌ల విడుద‌లైన మొద‌టి సాంగ్‌లో పూజా హెగ్డే.. ఎన్టీఆర్‌ని చూసి టఫ్‌గా కనిపిస్తారు కానీ మాట వింటారు.. ఫర్లేదు అనే డైలాగ్ అభిమానుల‌ని అల‌రించింది. ఇక రెండో సాంగ్‌గా 'పెనివిటి' అంటూ సాగే పాట‌ని బుధవారం సాయంత్రం 4.50ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 
 
రాయ‌ల‌సీమ స్లాంగ్‌లో ఈ పాట ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 'అరవింద సమేత' చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రథమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడట. ఎస్ఎస్ థ‌మ‌న్ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.