శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:07 IST)

బ‌న్నీ, ఎన్టీఆర్... చైత‌న్య‌ని చూసి నేర్చుకోవాలి..!

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజైన శైల‌జారెడ్డి అల్లుడు చిత్రానికి భారీ స్థాయిలో ఓపెన

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజైన శైల‌జారెడ్డి అల్లుడు చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అయితే... ఈ సినిమా సినీ విమ‌ర్శ‌కుల‌కు అంత‌గా న‌చ్చ‌లేదు. అందుకే చాలా రివ్యూస్ నెగిటివ్ గానే వ‌చ్చాయి. ఆ ప్ర‌భావం ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్ పైన ప‌డింది. అక్క‌డ ఆశించిన స్ధాయిలో క‌లెక్ష‌న్స్ రాలేదు.
 
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌టం విశేషం. 3 రోజుల‌కు 23 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాదులో ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్లో నాగ చైత‌న్య మాట్లాడుతూ... తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఆద‌రించి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. స‌పోర్ట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు, ఫ్యాన్స్‌కి నా థ్యాంక్స్. ఈ సినిమాతో ఫిల్మ్ క్రిటిక్స్‌ని సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయినందుకు సారీ చెబుతున్నాను. నా నెక్ట్స్ మూవీకి మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తాను. మీకు న‌చ్చేలా సినిమా చేస్తాన‌న్నారు. 
 
గ‌తంలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రాస్తే.. బ‌న్నీ రివ్యూ రైట‌ర్స్ పైన ఫైర్ అయ్యాడు. అలాగే జై ల‌వ‌కుశ గురించి నెగిటివ్ రివ్యూస్ రాస్తే ఎన్టీఆర్ ఫైర్ అయ్యాడు. కానీ.. చైత‌న్య మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. ద‌టీజ్ చైత‌న్య అనిపించాడు.