బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (18:53 IST)

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

jyothika
సిరుత్తై శివ దర్శకత్వంలో తన భర్త, హీరో సూర్య నటించిన కంగువా చిత్రం తొలి అర్థగంట బాగాలేదని సినీ నటి జ్యోతిక అన్నారు. ఇదే అంశంపై ఆమె ఆదివారం తన ఇన్‌స్టాఖాతాలో ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. సూర్య భార్యగా ఈ పోస్ట్ చేయడం లేదని, ఒక అభిమానిగా, మూవీ లవర్‌గా మాత్రమే  ఈ చిత్రంపై రివ్యూ చేస్తున్నట్టు వెల్లడించారు. 
 
'కంగువా.. అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎన్నో చిత్రాల్లో లోపాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో అలాంటి చిన్న లోపాలు ఉండటంలో తప్పులేదు. మూడు గంటల సినిమాలో కేవలం తొలి అరగంట మాత్రమే కదా సరిగా లేనిది. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది. 
 
ఆయన చిత్రాల్లో ఇలాంటి కెమెరా పనితనాన్ని మునుపెన్నడూ చూడలేదు. ఈ చిత్రానికి వస్తోన్న నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా. గతంలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రాల్లో మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా, సన్నివేశాలు బాగోకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు. భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండాఫ్‌లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. 
 
నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని రూపొందించడానికి బృందం ఎంచుకున్న కాన్సెప్ట్, ప్రయత్నానికి తప్పకుండా ప్రశంసలు దక్కాలి' అని జ్యోతిక పేర్కొన్నారు.