1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (17:31 IST)

కాజల్, రెజీనా, జనని ప్రధాన పాత్రలలో కార్తీక

Regina kasandra
Regina kasandra
అందాల భామలు కాజల్, రెజీనా, జనని అయ్యర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "కార్తీక". తమిళంలో కరుంగాపియం' పేరుతో ఇది తెరకెక్కింది. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకం పై ముత్యాల రామదాసు సమర్పణలో టి జనార్ధన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 
 
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సాగే ఈ చిత్రంలో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా ఒకసారి లైబ్రరీ కి వెళ్లి వంద ఏళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అందులోని పాత్రల గురించి ఆమె చదువుతుంటే అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు రావడం ఎంతో థ్రిల్ ను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు హాని కలిగించిన  వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ పోషించారు. అలాగే మిగతా కధా నాయికలు రెజీనా, జననీ అయ్యర్ పాత్రలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయి.
 
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన దర్శకుడు కార్తికేయన్ అద్భుతంగా చిత్రాన్ని తీశారు. అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో రైజా విల్సన్ (బిగ్ బాస్ తమిళ్ ఫేమస్), ఇరానియన్ నటి నోయిరికా నటించారు. ప్రసాద్ ఎస్‌ఎన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని విగ్నేశ్ వాసు అందించారు.