సంబంధిత వార్తలు
- మహారాష్ట్రలో నడిరోడ్డుపై మొసలి చక్కర్లు .. Shocking Video Viral
- ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై
- కంపెనీలో సగం వాటా ఇస్తే ఉద్యోగం మానేస్తా.. భర్తకు కండిషన్ పెట్టిన భార్య!!
- అమెరికాలో ఇంటిని సొంతం చేసుకున్న ట్రక్ డ్రైవర్ భారతీయుడు
- రెడ్ సిగ్నల్ పడగానే ఆగిన ఆవు.. గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్.. వీడియో వైరల్
సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..
"కల్కి" దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందించిన "కల్కి 2898 ఏడీ" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కరిపిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తూ ఓ ట్వీట్ చేశారు.
"సుమారు పదేళ్ల క్రితం మేం ముగ్గురం (నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్) కలిసి మా తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' ప్రారంభించాం. నిర్మాణ సంస్థ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకుంది. ఎంతో జాగ్రత్తగా దాన్ని రూపొందించాం. అప్పటి ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఒక రోజు వర్షం కారణంగా షూటింగ్ చేయలేకపోయాం. దీంతో మరుసటి రోజు మళ్లీ సెటప్ వేయాల్సి వచ్చింది.
దానికి అదనంగా చాలా ఖర్చయింది. దీంతో భయాందోళనలకు గురయ్యాం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు మా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో మైలు రాళ్లుగా నిలుస్తున్నాయి. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నా. మాలోని లోపాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అని నాగ్ అశ్విన్ రాసుకొచ్చారు.
