బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 మే 2024 (08:52 IST)

కమల్ హాసన్ వాడిన దుస్తులు కావాలని అడిగి తెప్పించుకున్నా : ప్రభాస్

Prabhas
Prabhas
కల్కి 2898 AD’లో తన అనుభవాలను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు తెలియజేశారు. ఆయన ఫ్యూచరిస్టిక్ వెహికల్ లో దాదాపు పండెండు రౌండ్లు గ్రౌండ్ లో వేశాక.. నింపాదిక కిందికి దిగి అక్కడే ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచొని అభిమానులు వున్న వైపు మాత్రమే చూస్తూ తన స్పీచ్ ను ఆరంబించారు.
 
ఆయన మాట్లాడుతూ, అమితాబ్, కమల్ హాసన్ నటన చూసి భారతదేశమే స్పూర్తి పొందింది. అలాంటి వారితో కలిసి పనిచేయడం నా అద్రుష్టం. అమితాబ్ మన దేశానికి గర్వకారణం. ఆయన స్పూర్తితో వచ్చాం. నా చిన్నప్పుడు కమల్ హాసన్ సర్ నటించిన సాగర సంగమమం చూసి అలాంటి దుస్తలు కావాలని మా అమ్మను అడిగి తెప్పించుకన్నా. ఆయన సినిమాలంటే పిచ్చి. తెగ చూసేవాడిని. అలాంటి నటుడితో కలిసి నటించడం గొప్ప అనుభూతి.
 
అలాగే అందమైన నటి దీపికా పడుకొనే, ఆమెతో కలిసిపనిచేయడం గొప్ప అనుభూతి. దిశాపటానిని హాట్ స్టార్ అంటుంటారు అశ్వనీదత్ గారు. ఆమెతో పనిచేయడం జరిగింది. ఇలా దేశంలో గొప్పనటులు ఈ సినిమాలో వున్నారు. అశ్వనీదత్ తోపాటు కుమార్తెలు స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్ లు చాలా కష్టపడి పనిచేశారు. నా బుజ్జిని పరిచయం చేసినవారికి క్రుతజ్నతలు తెలిజేస్తున్నా అన్నారు.