కమ్యూనిస్టులతో కమల్ హాసన్ దోస్తీ...
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. గాంధీ జయంతి రోజునో లేక దసరాకు కమల్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కమల్ ప్రతిపక్ష డిఎంకేతో జతకట్టి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఈ పార్టీతో కలవడం కన్నా సొంతం
విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. గాంధీ జయంతి రోజునో లేక దసరాకు కమల్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కమల్ ప్రతిపక్ష డిఎంకేతో జతకట్టి వెళ్ళాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఈ పార్టీతో కలవడం కన్నా సొంతంగా పార్టీ నడుపుకుంటేనే మంచిదన్న కొంతమంది సన్నిహితుల సలహాలతో కమల్ హాసన్ వెనక్కి తగ్గారు.
ప్రజలతో కలిసి.. ప్రజా సమస్యలపై పోరాడే వారితోనే ముందుకెళ్ళాలనుకున్న నిర్ణయానికి వచ్చారు కమల్. అందుకే కమ్యూనిస్టులను ఎంచుకున్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. సమస్య అంటే వాలిపోయే కమ్యూనిస్టులు తనకు సరిగ్గా సరిపోతారన్నది కమల్ ఆలోచన.
అందుకే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టే ముందు కమ్యూనిస్టులతో కలిసి ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఢిల్లీలోని కమ్యూనిస్టులు నేతలు సిపిఐ, సిపిఎంలతో ఇప్పటికే కమల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ ప్రారంభించిన వెంటనే కమ్యూనిస్టులతో తాను జతకట్టే విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు తెలుపనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ఏ విధంగా రాణించనున్నారో మరికొన్నిరోజుల్లో తేలిపోనుంది.