మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (14:47 IST)

కాంతార దర్శకుడితో అర్జున్ రెడ్డి.. అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్

Rishabh Shetty
ప్రముఖ కన్నడ దర్శకుడు రిషబ్ షెట్టి కాంతారా మూవీతో ప్రభంజనం సృష్టించాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో రిషబ్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే దానికి ఆసక్తి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో రిషబ్- విజయ్ దేవరకొండ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతోందని వార్తలు ఇండస్ట్రీలో రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియన్ సినిమా చేయడం విజయ్‌కి కొత్తేమీ కాదు. రిషబ్, విజయ్ కాంబినేషన్‏లో ఓ సినిమా వస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది. 
vijay devarakonda
 
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అదుర్స్ అంటున్నారు. రిషబ్ ప్రస్తుతం కాంతార సీక్వెన్స్ పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇక విజయ్ సమంతతో కలిసి ఖుషీ షూటింగ్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు.