గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (11:52 IST)

లాల్‌సలామ్ కోసం డబ్బింగ్ పూర్తి చేసిన కపిల్ దేవ్

kapil dev dubbing
kapil dev dubbing
రజనీకాంత్ కుమార్తె  ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  లాల్ సలామ్. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవిత రాజశేఖర్ కూడా రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది. ది లెజెండరీ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ తన డబ్బింగ్ ముగించాడు. ఈ విషయాన్ని యూనిట్ తెలియజేసింది. ఐశ్వర్య దగ్గర ఉంది డబ్బింగ్ పనులు చూసుకుంది. 
 
ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాను  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో  2024 పొంగల్ కు  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.