ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (06:58 IST)

పవర్‌తో పాటు.. కంటెంట్ ఉన్న నటుడు పవన్ కల్యాణ్: కరీనా కపూర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవర్‌తో పాటు.. కంటెంట్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భామ.. ‘వీరే ది వెడ్డింగ్’ అనే చిత్రంలో న

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవర్‌తో పాటు.. కంటెంట్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భామ.. ‘వీరే ది వెడ్డింగ్’ అనే చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ సందర్భంగా దక్షిణాది చిత్రపరిశ్రమపై స్పందిస్తూ... దక్షిణాదిన పవన్ కల్యాణ్ నుంచి రజనీకాంత్ వరకు చాలా గొప్ప నటులు ఉన్నారని, వారిలో కంటెంట్ కూడా ఉందని చెప్పింది. 
 
భాష సమస్య కారణంగా దక్షిణాది చిత్రాల్లో నటించాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, అయితే, మణిరత్నం దర్శకత్వంలో నటించిన ‘యువ’ సినిమాను తాను మర్చిపోలేనని కరీనా చెప్పుకొచ్చింది. ఈమె సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయిన విషయం తెల్సిందే.