బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

కళ్యాణ్ రామ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది : కర్నాటక మంత్రి సుధాకర్

sudhakar minister
హీరో కళ్యాణ్ రామ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని కర్నాటక ఆరోగ్య శాఖామంత్రి సుధాకర్ తెలిపారు. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఆదివారం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో తారకరత్నను ఆయన చూశారు. 
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శనివారంతో పోల్చితే ఆదివారానికి తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్నారు. అయితే, మన స్పృహలోకి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 
 
కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోనైన తారకరత్నను బెంగుళూరు నుంచి తీసుకొచ్చేందుకు గ్రీన్ చానల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించామని, ఇక్కడ ఆయనకు మెరుగైన చికిత్స జరుగుతుందని చెప్పారు. నిన్నటి కంటే ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్టు భావిస్తున్నామని మంత్రి సుధాకర్ తెలిపారు. 
 
నిమ్హాన్స్ నుంచి బ్రెయిన్ స్పెషలిస్టు వైద్యులను కూడా పిలిపించామని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. తారకరత్న పరిస్థిపై సీఎం బసవరాజ్ బొమ్మై కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారని, ఎప్పటికపుడు సమాచారం తెలుసుకుంటున్నారని తెలిపారు. మంత్రి వెంట ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఉన్నారు.