శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (14:54 IST)

సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారు.. పద్మావత్‌పై కర్ణిసేన ఎద్దేవా

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు తగిలింది. అయితే అనేక వివాదాల మధ్య పద్మావత్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.150కోట్లకు పైగా వ

పద్మావత్ సినిమా అంటేనే ముందు నుంచీ మండిపడుతున్న కర్ణిసేన.. సినిమా విడుదలకు అడ్డు తగిలింది. అయితే అనేక వివాదాల మధ్య పద్మావత్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.150కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పద్మావత్ కలెక్షన్లపై రాజ్ పుత్ కర్ణిసేన తనదైన శైలిలో స్పందించింది. మనదేశంలో సన్నీలియోన్‌కు కూడా అభిమానులున్నారని ఎద్దేవా చేశారు. 
 
పద్మావత్ సినిమాకు మంచి రివ్యూలు, కలెక్షన్లు వస్తున్నాయంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కర్ణిసేన ప్రతినిధి విజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వక్రీకరణలు చాలా వున్నాయన్నారు. గర్భవతి ఆత్మాహుతి (జౌహార్)కి పాల్పడినట్లు సినిమాలో చూపించారు కానీ.. నిజానికి ఏ గర్భవతి కూడా జౌహార్‌కు అస్సలు పాల్పడదన్నారు. 
 
చిత్తోర్ గఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ పగులకొట్టలేదని, చరిత్ర ప్రకారం కోట ద్వారాన్ని పెకిలించి తనతో పాటు ఢిల్లీకి ఖిల్జీ తీసుకుపోయినట్లు తెలిపారు. 400 ఏళ్ల తర్వాత భరత్‌పూర్ రాజు ఈ ద్వారాన్ని మళ్లీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టించారని చెప్పారు.