బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (13:20 IST)

ఆర్ఎక్స్ 100 హీరో మూడో సినిమా ఫస్ట్‌లుక్ విడుదల

గతేడాది ఆర్ఎక్స్ 100 చిత్రంలో ప్రేమలో విఫలమైన యువకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన హీరో కార్తికేయ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఒక్క చిత్రంతో కార్తికేయకి మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న కార్తికేయ.. నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్‌లో విలన్‌గా కనిపించనున్నాడు. 
 
మరోవైపు హిప్పీ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. కాగా కార్తికేయ మూడో చిత్రానికి సంబంధించి ఆ మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు.
 
గుణ 369 అనే టైటిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. చింతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చనున్నాడు. 
 
గుణ 369 చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో కార్తికేయ భారీ కండ‌లు మాత్ర‌మే చూపించి ముఖాన్ని దాచారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.