శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 21 మార్చి 2019 (13:12 IST)

కీర్తి 20లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా..?

నేను శైల‌జ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్స‌స్ సాధించిన‌ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ త‌ర్వాత నేను లోక‌ల్, అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌క హృద‌యాల‌ను దోచుకుంది.
 
 మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర‌లో అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకుంది. మహానటి తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ .. తమిళంలో ఆమె వరుస సినిమాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఒక కథ నచ్చడంతో చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్‌ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. క‌థానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. 
 
రాజేంద్ర‌ప్ర‌సాద్, సీనియర్ నరేష్, నదియా, కమల్ కామరాజు భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం తీసుకున్నారు. దీనికి సంబంధించిన స్పెష‌ల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. మరి కొంతమంది నటీనటుల పేర్లను త్వరలోనే తెలియజేయనున్నట్టు చెప్పారు.