గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (19:33 IST)

నన్ను అలా చేసినా వారితో స్నేహం చేస్తా - కీర్తి సురేష్

ఒకే ఒక్క సినిమా సావిత్రి క్యారెక్టర్ మహానటి సినిమాసో నటించి అందరి మన్ననలు అందుకున్నారు కీర్తి సురేష్. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడే సమయంలో కీర్తికి మర్చిపోలేని విజయాన్నిచ్చింది మహానటి. ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ రెండు మూడు సినిమాలు చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు.
 
కీర్తి సురేష్ గురించి వదంతులు సృష్టించే వారి సంఖ్య తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. దీంతో కీర్తి మొదట్లో బాధపడినా ఆ తరువాత మాత్రం గట్టిగా నిలబడింది. నన్ను విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉంటారో నన్ను పొగిడేవారు ఉంటారు. కాబట్టి నేను విమర్సకులను పట్టించుకోను అంటోంది కీర్తి. 
 
ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తనపై జరుగుతున్న దుష్ర్పచారానికి స్నేహితులు కూడా స్పందించవద్దంటోంది. తనను ఎవరైతే విమర్సిస్తారో  వారితోనే స్నేహం చేస్తానంటోంది కీర్తి సురేష్.