ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (06:22 IST)

మా నాన్నకు హీరోయిన్లంటే పిచ్చి... వైజయంతీమాలతో 'ఆ' లింకుంది : రిషి కపూర్

బాలీవుడ్ హీరో రిషి కపూర్. ఈయన తండ్రి రాజ్‌ కపూర్. ఈయన కూడా ఒకనాటి వెండితెర అగ్రహీరోనే. 64 యేళ్ల ఈ మునుపటితరం హీరో రిషి కపూర్ 'ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్' పేరుతో తన స్వీయ జీవితచరిత్ర పుస్

బాలీవుడ్ హీరో రిషి కపూర్. ఈయన తండ్రి రాజ్‌ కపూర్. ఈయన కూడా ఒకనాటి వెండితెర అగ్రహీరోనే. 64 యేళ్ల ఈ మునుపటితరం హీరో రిషి కపూర్ 'ఖుల్లం ఖుల్లా: రిషీకపూర్‌ అన్‌సెన్సార్డ్' పేరుతో తన స్వీయ జీవితచరిత్ర పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో తన తండ్రి రాజ్‌ కపూర్‌ రాసలీలలు, తన చిన్ననాటి అనుభవాలు, తనకొచ్చిన పేరు ప్రతిష్టలు, ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలను ఆ పుస్తకంలో వెల్లడించాడు. అంతేనా.. మాఫి
యాడాన్ దావూద్‌ ఇబ్రహీంతో రెండుసార్లు కలిసిన సందర్భంగా అనుభవాలను కూడా విపులీకరించారు. 
 
అయితే, తన తండ్రి అయిన బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజ్‌ కపూర్‌ గురించి కూడా రిషీ కపూర్‌ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సినిమాలు, మద్యం, కథానాయికలు.. ఇవే తన తండ్రిలోకమని వెల్లడించాడు. నర్గీస్‌, వైజయంతీమాల తదితర హీరోయిన్లతో తన తండ్రికి ఉన్న సంబంధాలను పూసగుచ్చినట్టు ఆ పుస్తకంలో రిషి కపూర్ వివరించారు.