శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (16:37 IST)

'ఆదిపురుష్' మూవీ క్రేజ్ : మల్టీప్లెక్స్ మొత్తాన్ని బుక్ చేసిన కృతి సనన్

kriti sanon
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వ వహించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలైంది. ఇందులో కృతి సనన్ జానకీ పాత్రలో నటించారు. సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినా.. కృతి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందంటూ ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా కోసం కృతి ఢిల్లీలోని మల్టీప్లెక్స్‌లో ఓ షోకు మొత్తం టికెట్లు బుక్‌ చేసినట్లు సమాచారం. తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పిల్లల కోసం ఇవి బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. వాళ్లతో పాటు కృతి కూడా తన కుటుంబంతో కలిసి మరోసారి సినిమా చూడనుందట. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
ఇక కృతికి తాను చదువుకున్న స్కూల్‌ అంటే ఎంతో అభిమానం. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. ఇటీవల స్కూల్‌ ప్రారంభించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా సోషల్‌ మీడియాలో ప్రత్యేక పోస్ట్‌ పెట్టి అభినందించింది. అలాగే గతంలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘భేడియా’ సినిమాను ఆ స్కూల్‌లోనే ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే.