బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (18:37 IST)

ఆచార్య లాహే లాహే సాంగ్ కొత్త రికార్డ్.. 60 మిలియన్ల వ్యూస్ దాటేసింది..

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా ఆచార్య సినిమాతో తన మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేసేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్స్ పునరుద్ధరించారు.
 
కొరటాల శివ దర్శకత్వంతో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. మెగాస్టార్‌కు గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
 
ఆచార్య సినిమా నుంచి ఇటీవల విడుదలైన లాహే లాహే లిరికల్ వీడియో సాంగ్ మరో మైలురాయి చేరుకుంది. 60 మిలియన్ల వ్యూస్ దాటి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సత్తాను ఆచార్య మూవీ మరోసారి రుజువు చేసేలా ఉందని టాక్ వినిపిస్తోంది. 
 
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోందని తెలిసిందే. వివాహం అనంతరం కాజల్ చేస్తున్న సినిమా ఇది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే జంటగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. 
Acharya
 
ఇదివరకే విడుదలైన ఆచార్య టీజర్, చిరంజీవి, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను మెప్పించాయి. ఆచార్య సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.