శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (14:27 IST)

లాస్య మంజునాథ్ సీమంతం ఫోటోలు వైరల్

తెలుగు యాంకర్-బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫేమ్ లాస్య మంజునాథ్ సీమంతం ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా లాస్యకు శుభాకాంక్షలు చెప్తున్నారు. 
 
లాస్య కుటుంబ సభ్యులు బేబీ షవర్ వేడుక (సీమంతం)ను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హారిక, గీతూ రాయల్ సహా బిగ్ బాస్ స్టార్స్ హాజరయ్యారు. 
 
ప్రస్తుతం యాంకర్ లాస్య 'సీమంతం' ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే లాస్య, మంజునాథ్‌లు దంపతులకు ఒక అబ్బాయి వున్నాడు. ఆ అబ్బాయి పేరు జున్ను.